ప్రముఖ బాక్సర్‌ను అభినందించిన ఎమ్మెల్సీ కవిత..

131
mlc kavitha
- Advertisement -

రాష్ట్రానికి చెందిన ప్రముఖ బాక్సర్ నిక్కత్ జరీన్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిక్కత్ జరీన్ ప్రతిభను గుర్తించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టాఫ్ ఆఫీసర్‌గా ఉద్యోగం కల్పించింది. ఈ‌రోజు హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితను, నిక్కత్ జరీన్ తల్లిదండ్రులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నిక్కత్ జరీన్‌ను అభినందించిన ఎమ్మెల్సీ కవిత, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఎంతో కష్టపడి బాక్సింగ్‌లో ప్రపంచస్థాయికి ఎదిగిన నిక్కత్ జరీన్, యువతకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత. అంతేకాదు ‌నిక్కత్ జరీన్‌ను‌ క్రీడలవైపు ప్రోత్సాహించిన తల్లిదండ్రులు ‌పర్వీన్, జమీల్‌లను‌ సైతం ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా,సాట్స్ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -