వరంగల్ నగరంలోని వరద ముంపు ప్రాంతాలను సందర్శించి, బాధితులను పరామర్శించారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాబివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, రాష్ట్ర మహిళా సాధికారత సంస్థ చైర్మన్ గుండు సుధారాణి.
రెస్క్యూ టీమ్ లతో కలిసి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. వదర ముంపు కాలనీల్లో తెప్పల్లో, మెకాటిలోతు నీళ్ళల్లో కాలినడకన ప్రజలను కలిశారు.
నగరంలోని మైసయ్య నగర్, రాన్నపేట రెండు వీధులు, సంతోషిమాత గుడి కాలనీ తదితర ముంపు ప్రాంతాల్లో పర్యటించగా వరద ముంపు ప్రాంతాల ప్రజలకు తక్షణమే పునరావాస కేంద్రాలు, భోజన సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు ఎర్రబెల్లి. వరద ముంపు లేకుండా శాశ్వత నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
వరద సహాయంగా ప్రజలకు తక్షణ సదుపాయాలన్నీ కల్పించాలని కలెక్టర్, కమిషనర్, ఆర్డీవో, ఎమ్మార్వో తదితర అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట కలెక్టర్, కమిషనర్, స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.