పిలిస్తే పలకడం, ఆపన్నులను ఆదుకోవడం, తన వాళ్ళను అక్కున చేర్చుకోవడంలో దయన్న స్టైల్ వేరు. అందుకే అంతా ఆయన్ని దయన్నా! అని ముద్దుగా, గౌరవంగా పిలుస్తారు. అందుకు తగ్గట్లుగా దయన్న సైతం మరింతగా జనంలో తలలో నాలుకలా ఉంటారు. ఇలాంటి ఘటనే ఇది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి తన పేరుని సార్ధకం చేసుకున్నారు. తన వద్ద వంట మనిషిగా పని చేసే మాలో త్ శివ ఇంటికి వెళ్ళి వారి పండుగలో పాలు పంచుకున్నారు.
పర్వత గిరి మండలం చెరువు కొమ్ము తండా కు చెందిన మాలో త్ సొమ్లా కొడుకు శివ చాలా కాలంగా మంత్రి ఇంటివద్ద వంట మనిషిగా పని చేస్తున్నాడు. ఈ రోజు సి కె తండా లో దుర్గమ్మ పండుగ చేసుకుంటున్నారు. ఈ పండుగ కు రావాల్సిందిగా శివ మంత్రి ని కోరారు. అయితే మంత్రి ఈ రోజు వివిధ కార్యక్రమాల్లో బిజీ గా ఉన్నారు. వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల టీఆరెఎస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమం నల్లగొండలో ఉంది. ఆ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరు కావాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాకు చెందిన మిగతా నేతలతో కలిసి వెళ్ళాలి. అయినా సరే, తన కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా, మంగళవారం ఉదయం సి కే తండాకు వెళ్ళారు. అక్కడి దుర్గమ్మ గుడిని సందర్శించారు. దుర్గమ్మ మాత ను దర్శించారు. శివ ఇంటికి వెళ్ళారు. ఆ కుటుంబంతో కాసేపు గడిపారు. శివ ఇంటి సభ్యులతో ఫోటోలు దిగారు. అక్కడకు వచ్చిన తండా వాసులతో కలివిడిగా పలకరిస్తూ ఫోటోలు దిగారు. తనకు పరిచయం ఉన్న వాళ్ళతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కాసేపు తండాలో సందడి చేశారు. అందరినీ సంతోష పెట్టారు. వాళ్లకు దుర్గమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి నేరుగా నల్లగొండ కు బయలుదేరారు.
మరోవైపు తన వెన్నంటే ఉండే తన వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ వడ్లకొండ పరమేశ్ పుట్టిన రోజు ఈ రోజే కావడంతో, అతడిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆశీర్వదించారు. అతనితో ఫోటో దిగారు. శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.