- Advertisement -
దేశంలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి హరీశ్ రావు. జనగామ జిల్లా సింగరాజుపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన హరీశ్ రావు…రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ధాన్యం, పత్తి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.
పాలకుర్తి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు ఎర్రబెల్లి. జిల్లాలో 1.50 లక్షల ఎకరాల విస్తీర్ణంలో 3.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది.110 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.
రైతులు ఆందోళన చెందొద్దని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులకు ప్రపంచంలో రైతు వేదికలు ఎక్క డా లేవన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో రైతులు సగర్వంగా బ్రతికే రోజులు రాబోతున్నాయని చెప్పారు.
- Advertisement -