రైతుల మోటార్లకు మీటర్లు పెట్టనిద్దమా అని ప్రశ్నించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహబూబాబాద్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండల కేంద్రంలోని ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయ భవనం మరియు గోదాములను ప్రారంభించారు ఎర్రబెల్లి.
తొర్రూరు PACS లోని మొత్తం 10 వేల 31 మంది రైతులు సభ్యులుగా ఉన్నారని..మొత్తం సభ్యుల వాటా 1 కోటి 45 లక్షల రూపాయలు కాగా,సంఘం ద్వారా రుణం పొందిన 2,248 మందికి 14 కోట్ల 37 లక్షల రూపాయలు అన్నారు. గతంలో ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? సమీక్షించుకోవాలన్నారు. గతంలో ఇన్ని నిధులు, ఇంత రుణాలు, ఇంత రికవరీ ఉందా? అని ప్రశ్నించిన ఎర్రబెల్లి..సీఎఎం కెసిఆర్ దయ వల్ల ఇవ్వాళ రైతు అత్యంత సంతోషంగా ఉన్నారన్నారు.
గతంలో రైతులు తీవ్ర ఆందోళనతో అయోమయంలో ఆవేదనతో ఉండేవాడన్నారు. కానీ ఇవ్వాళ సీఎం కెసిఆర్ సీఎం అయ్యాక కరెంటు, నీళ్ళు, ఎదురు పెట్టుబడి ఇచ్చిన మహానుభావుడు సీఎం కెసిఆర్ అన్నారు. సీఎం కెసిఆర్ ఒకవైపు రైతులకు మేలు చేస్తుంటే, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కిడు చేస్తుందన్నారు. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం కుట్ర పన్నుతుందన్నారు. దేశ వ్యాప్త రైతుల కోసం ఉద్యమించిన 7 వేల మంది రైతులకు పొట్టన పెట్టుకున్న, కాల్చి చంపిన ప్రభుత్వం బీజేపీ ది అన్నారు.
ప్రజలు.ఆలోచించాలి. సీఎం కెసిఆర్ రైతుల కోసం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం ను చూడాలన్నారు. కాళేశ్వరం ద్వారా వద్దంటే నీరు ఇస్తున్న, 24 గంటల కరెంట్ ఇస్తున్న, రైతు బంధు, రైతు బీమా ఇలా దేశంలో ఎవరైనా ఇస్తున్నారా? అన్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని…మోడీ హైదరాబాద్ వేదికగా 200 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. 1250 కి పెంచారన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచిన ప్రజా వ్యతిరేక ప్రభుత్వం బీజేపీ ప్రజలను, రైతులను మోసం చేస్తున్న బీజేపీ ని ప్రజలు తరిమి తరిమి కొట్టాలన్నారు.
ఇవి కూడా చదవండి..