బీజేపీ నేతలను ఉరికిచ్చి కొడతారు: ఎర్రబెల్లి

64
Minister Errabelli
- Advertisement -

రైతుల ధాన్యం కొనుగోలు చేయకపోతే మళ్ళీ మళ్ళీ బీజేపీ నేతలను ఉరికిచ్చి కొడతారని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్‌ఎస్‌ అధినేత ధర్నాకు పిలుపునివ్వగా ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి…కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

కేంద్రం వైఖరితో రైతుల కోసం కేసీఆర్ పోరాటం చేస్తున్నారని ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారని, దానికి స్పందన వచ్చిన తర్వాత మా కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ నేతలను ప్రజలు ఉరికిచ్చి కొడుతున్నారని, తెలంగాణలో బీజేపీ ఒక పార్టీయేనా? అని ప్రశ్నించారు.

ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మహాధర్నా జరగనుంది. సీఎం కేసీఆర్‌తో సహా ప్రజా ప్రతినిధులు, జిల్లా పరిషత్ చైర్మన్‌లు ధర్నాలో పాల్గొననున్నారు. ధర్నా అనంతరం గవర్నర్ తమళిసైకి వినతిపత్రం అందించనున్నారు.

- Advertisement -