- Advertisement -
కరోనా పాజిటివ్ బాధితులతో ఫోన్‌లో మాట్లాడి వారిలో ధైర్యం నింపారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆరోగ్యం బాగుందా… అంటూ బాగోగులు తెలుసుకున్నారు.
కరోనాను జయించి రావాలని కోరుకుంటున్నాను అంటూ ధైర్యం చెప్పిన ఎర్రబెల్లి….కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు అధైర్యపడవద్దన్నారు. మీకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.
మీరు బాగుండాలని కోరుకుంటున్నాను….మీకు ఏదైనా సహాయం కావాల్సి వస్తే నన్ను సంప్రదించాలన్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు బాగుండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
- Advertisement -