తెలంగాణలో రైతు రాజ్యం: మంత్రి ఎర్రబెల్లి

199
errabelli
- Advertisement -

తెలంగాణలో రైతు రాజ్యం నడుస్తోందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహబూబాబాద్ జిల్లా పరిధి, పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండల కేంద్రంలో ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్వర్యంలో ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాల ను ప్రారంభించారు రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి….రైతును రాజు ను చేయడమే లక్ష్యంగా సీఎం కెసిఆర్ పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. అందుకు అనుగుణంగా అనేక పథకాలు చేపట్టారు…దేశంలో ఎక్కడా లేనన్ని రైతు పథకాలు మన రాష్ట్రం లోనే అమలు అవుతున్నాయని వెల్లడించారు.

సాగు నీరు, 24 గంటలు నాణ్యమైన కరెంటు, రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ, పంటల కొనుగోలు వంటి అన్ని రైతు సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి….ఇంత నిబద్ధతతో పని చేసిన, చేస్తున్న సీఎం లు దేశంలో లేరు అన్నారు. ఇక్కడ సీఎం ధాన్యం కొంటుంటే అక్కడ కేంద్రం అడ్డుకాలు వేస్తున్నది…మద్దతు ధర సహా, ధాన్యం ఎక్కువ కొనవద్దని అంటున్నదన్నారు.

ఇక్కడ కొందరు, మద్దతు ధర పెంచాలని రకరకాలుగా మాట్లాడుతున్నారు…వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో, దేశంలో ఎక్కడైనా ప్రభుత్వాలు ధాన్యం కొంటున్నయా రైతులు అవగాహన చేసుకోవాలి….చెప్పుడు మాటలు వినొద్దు, రైతులు చెడి పోవద్దన్నారు. ప్రజా ప్రతినిధులు రైతులకు ప్రభుత్వ కార్యాచరణ ను అర్థం చేయాలి…రాష్ట్రంలో కోటిన్నర ఎకరాలు సాగు జరిగిందన్నారు.

- Advertisement -