బిహార్ లో మహాగట్‌బంధన్‌కే ఆధిక్యం…ఎగ్జిట్ పోల్స్

178
bihar
- Advertisement -

బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల సమరంలో మహాగట్‌ బంధన్‌ (కాంగ్రెస్-ఆర్జేడీ-వామపక్ష కూటమి)కే స్వల్ప ఆధిక్యత లభించే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్- పీఎస్జీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

బిహార్‌లోని మొత్తం 243 సీట్లకు గాను రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీకి 85- 95 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 15- 20, ఎల్‌జేపీ 3-5, వామపక్షాలు 3-5 సీట్లు సాధిస్తాయని సర్వే పేర్కొంది. ఇక అధికార ఎన్డీయే కూటమిలోని బీజేపీకి 65-75 సీట్లు దక్కే అవకాశం ఉండగా, జేడీ(యూ) 25-35 సీట్లకే పరిమితం కానున్నట్లు వెల్లడించింది.బిహార్ తదుపరి ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ వైపు 36 శాతం, నితీష్ కుమార్ వైపు 34 శాతం మంది ఓటర్లు మొగ్గు చూపారు

ఇక మధ్యప్రదేశ్‌లో బీజేపీ 16-18, కాంగ్రెస్‌ 10-12, బీఎస్పీ 0-1 స్ధానం గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించాయి ఎగ్జిట్ పోల్స్. ఉత్తరప్రదేశ్‌ ఉపఎన్నికల్లో 7 స్థానాలకు- బీజేపీ 5-6, ఎస్పీ 0-1, బీఎస్పీ 0-1 గెలుచుకునే అవకాశం ఉందని తెలిపాయి.

- Advertisement -