బెంగాల్ ఎన్నికల్లో పోటీపై అసద్‌ క్లారిటీ!

61
owaisi

బెంగాల్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ..విమర్శలు వస్తున్న నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. బీజేపీకి మద్దతిచ్చేందుకే మజ్లిస్ బెంగాల్ లో పోటీ చేస్తుందన్న వార్తలను ఖండించారు అసద్. తనను కొనేవారు ఈ భూమ్మీద పుట్టలేదని స్పష్టం చేశారు. బెంగాల్ సీఎం మమత తనపై చేసి వ్యాఖ్యలు నిరాధారమైనవని ఖండించారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన నేతలు బీజేపీలో చేరుతున్నారని, దీంతో పార్టీ ఫిరాయింపులపై ఆమె ఆందోళన చెందుతున్నారని విమర్శించారు. ఆప్‌ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో పోటీచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఓవైసీ ప్రకటించారు.

ముస్లింల ఓట్లను చీల్చడానికి హైదరాబాద్‌ నుంచి ఓ పార్టీని పట్టుకొస్తున్నారని, బీజేపీ ఇచ్చిన డబ్బుతో ఆ పార్టీ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో పోటీచేస్తుందని మమతా ఆరోపించగా వాటిని ఖండించారు అసద్.