- Advertisement -
త్వరలో జనగామ టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సీఎం కేసీఆర్, మంత్రి కెటీఆర్ ల చేతుల మీదుగా ప్రారంభింపచేస్తాం అన్నారు. నిర్మాణంలో వున్న జనగామ TRS పార్టీ కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఎర్రబెల్లి… కరోనా కారణంగా టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణం ఆలస్యమైందన్నారు.
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది…… ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఎర్రబెల్లి. మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకొని కరోనా మహమ్మారిని అరికడుదామన్నారు. అతి త్వరలో కార్యాలయాన్ని పూర్తి చేసి కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులోకి తెస్తామన్నారు.
- Advertisement -