రైతు వేదికల నిర్మాణాల్లో వేగంపెంచండి: ఎర్రబెల్లి

54
errabelli

పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల ప‌నుల ప్ర‌గ‌తి, రైతు వేదిక‌లు, పిఎంజిఎస్ వై రోడ్ల ఆన్ గోయింగ్ ప‌నుల‌పై స‌మీక్ష నిర్వహించారు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు. పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పిఆర్ ఇఎన్ సి స‌త్యానారాయ‌ణ రెడ్డి, పిఎంజిఎస్ వై సిఇ సంజీవరావు పాల్గొన్నారు.

నిర్ణీత ల‌క్ష్యాల‌క‌నుగుణంగా… ఆయా ప‌నులు నిర్ణీత స‌మ‌యంలో జ‌ర‌గాలన్నారు.రైతు వేదిక‌లు, రోడ్లు, ఇత‌ర ప‌నుల‌న్నీ నాణ్య‌త ప్ర‌మాణాల‌క‌నుగుణంగా జ‌రిగేలా చూడాలన్నారు.త్వ‌రిత గ‌తిన ‌ప‌నులు పూర్తి కావాలి….అభివృద్ధి ప‌నుల్లో ఆల‌స్యం త‌గ‌దు..ఆయా ప‌నులు అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్ళి ప‌ర్య‌వేక్షించాలన్నారు. క‌రోనా నేప‌థ్యంలో కుంటుప‌డిన ప‌నుల‌న్నీ… రెట్టించిన వేగంగా పూర్తి చేయాల‌ని అధికారుల‌కు మంత్రి దిశానిర్దేశం చేశారు.