వరంగల్ సెంట్రల్ జైల్లో ఖాళీగా ఉన్న 23ఎకరాల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ నిర్మించాలని కేసీఆర్ ఆదేశించారని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి…భారతదేశంలో ఏముఖ్యమంత్రి చేయని పని కేసీఆర్ చేశారని….ఎంజీఎంలో ప్రతీ కరోనా పేషెంట్ ను పలకరించి ధైర్యం చెప్పారన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీ పోస్టులను రెండు రోజుల్లో భర్తీ చేయాలని సీఎం ఆదేశించారన్నారు. సంవత్సర కాలంలోనే వరంగల్‌లో మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని పూర్తి చేయాలన్నారు. పాత ఎంజీఎం ఆస్పత్రిని కూల్చేసి మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. హైదరాబాద్ ను మించి ఇక్కడ వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
వల్లే వ్యాక్సిన్ ల కొరత ఏర్పడిందని….వరంగల్ ను హెల్త్ హబ్ గా తయారు చేయాలనేదే సీఎం ఆలోచన అన్నారు. వరంగల్ ప్రజలు, ప్రజాప్రతినిధులందరి తరుపున సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు..మోడీ బయటకు రావాలన్నారు. రాష్ట్రాలకు తిరగాలి….ప్రజల సింపథి కోసం మీడియా ముందు ఏడవడం కాదన్నారు. హైదరాబాద్ ను మించి ఇక్కడ వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.కనీసం వ్యాక్సిన్ వేయించే సోయిలేదు మీకు..బీజేపీ నేతలు పిచ్చి పిచ్చి మాటాలు మానుకోవాలన్నారు.పైసాకు అక్కరికి రాని బీజేపీ నేతలు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పారు.