మరింత కఠినంగా లాక్‌డౌన్‌….

58
dgp

లాక్ డౌన్ కఠినతరం చేసిన నేపథ్యంలో కూకట్‌పల్లి వై జంక్షన్ చౌరస్తా మరియు జె.ఎన్.టి.యు చౌరస్తా లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు డీజీపీ మహేందర్ రెడ్డి. లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. సరైన అనుమతులు లేకుండా, అకారణంగా రోడ్డు పైకి వచ్చే వారి వాహనాలు చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

డీజీపీ ఆదేశాలతో నగరంలో పోలీసులు లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. పాస్‌లు, ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన రంగాలకు చెందిన వారి వాహనాలనే అనుమతిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారి వాహనాలను సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తున్నారు.