కోవిడ్ బాధితులకు వైద్య సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ అన్ని చర్యలు చేపడుతున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. శనివారం తొర్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ 30 పడకల విభాగాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ఓ.పి, ఆక్సిజన్ తో కూడిన బెడ్స్ వంటి వైద్య సౌకర్యాలను మంత్రి సందర్శించి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఆర్డిఓ రమేష్, మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, జడ్పిటిసి శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు, జిల్లా కోవిడ్ నోడల్ అధికారి రాజేష్, తొర్రూరు ఉప వైద్యాధికారి డాక్టర్ మురళీధర్, డాక్టర్లు దిలీప్ మీరజ్, రేణుక, విజయ్ కుమార్, వేద కిరణ్, మున్సిపల్ కమిషనర్ గుండె బాబు ,తహసిల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో భారతి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.