సీఎం కేసీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు..

115
- Advertisement -

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నెల వేతనాన్ని 15 వేల రూపాయల నుండి 28,719 రూపాయలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ కొత్త జీతాలు జూలై 1వ తేదీ నుండి అమలులోకి వస్తాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నెల వేతనాన్ని 15 వేల నుండి 28 వేల 719 రూపాయలకు పెంచినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఎంపిక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం 2019 ఏప్రిల్ నుండి ప్రారంభించి భర్తీ చేసిందని ఆయన తెలిపారు. గ్రామాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలుకు పంచాయతీ కార్యదర్శులు ఎంతగానో కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. వేతనాలు పెంచినదున మరింత ఉత్సాహంతో పని చేయాలని ఆయన గ్రామ కార్యదర్శి లను కోరారు.

- Advertisement -