రాష్ట్రంలో రాగల 3 రోజులు భారీ వర్షాలు..

44
rains

తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఒకటి ,రెండు ప్రదేశాలలో కొన్ని జిల్లాలలో భారీ వానలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో చాలా జిల్లాలలో రాగల 3 రోజులు ఉరుములు మరియు మెరుపులతో పాటు ఈదురు గాలులు గంటకు 30 నుండి 40కి మీ వేగంతో కూడిన వర్షాలు వచ్చే అవకాశములు వున్నదని వాతావరణ కేంద్రం తెలిపింది.