దేశంలోనే పెద్దది ఎనుమాముల మార్కెట్- మంత్రి

318
errabelli
- Advertisement -

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఈ రోజు వరంగల్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,ప్రభుత్వ చీప్ విప్ బి.వెంకటేశ్వర్లు, రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మేయర్ గుండా ప్రకాష్, జెడ్పి చైర్మన్లు గండ్ర జ్యోతి, సంపత్ రెడ్డి, కె.జగదీష్, ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, కూడా చైర్మన్ మర్రి యాడవరెడ్డి లు పాల్గొన్నారు.

dayakar

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఎనుమాముల మార్కెట్ దేశంలోనే పెద్దది. అందరం కలిసి దీన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అభివృద్ధి సాధ్యమని సీఎం కేసీఆర్ చేసి చూపించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు సర్కారు. రైతులకు పెట్టుబడితోపాటు గిట్టుబాటు ధరలు ఇస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయడం లేదు. ఒక్క తెలంగాణలొనే ఏటా దాదాపు రూ.13 వేల కోట్లతో వడ్ల కొనుగోలు జరుగుతోంది.

అలాగే పత్తి కొనుగోలు చేసే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీసీఐ మాత్రం రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చే విషయంలో చిత్తశుద్ధి చూపడంలేదు. వరంగల్ వ్యవసాయ మార్కెట్ రైతులకు మేలు చేసేలా ఉండాలి. టిఆర్ఎస్ లో ప్రతి సాధారణ కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో టిఆర్ఎస్ అధిష్టానం సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

- Advertisement -