రెండేళ్ల పాలనపై పుస్తకం విడుదల చేసిన సీఎం జగన్‌..

78

రాష్ట్ర ప్రజలందరి సహకారంతో రెండేళ్ల పాలన పూర్తి చేసుకోగలిగామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 86 శాతం ఇళ్లకు ప్రభుత్వ పథకాలు చేరాయని అన్నారు. వివిధ పథకాల కింద అర్హుల ఖాతాల్లో నేరుగా రూ.95,528 కోట్లు జమ చేసినట్లు ఆయన తెలిపారు. పరోక్షంగా ప్రజలకు మరో రూ. 36,197 కోట్ల లబ్ధి చేకూరిందని వెల్లడించారు.

ప్రభుత్వ పథకాలపై 2 డాక్యుమెంట్లను రూపొందించి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. వివిధ ప్రభుత్వ పథకాల కింద ప్రజలకు లబ్ధి చేకూర్చామని, ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరే కార్యక్రమం చేపట్టామని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 94.5 శాతం అమలు చేశామని అన్నారు. ప్రభుత్వానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.