పిఎంజిఎస్‌వై రోడ్ల అంశంపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష..

93
errabelli

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు పిఎంజిఎస్ వై రోడ్ల అంశంపై సంబంధిత ఉన్నత అధికారులతో సమీక్షించారు. పిఎంజిఎస్ వై రోడ్ల పనుల పురోగతిపై మంత్రి చర్చించారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలోని తన శాఖల ఆఫీసులో సంబంధిత అధికారులతో మంత్రి సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధాన మంత్రి గ్రామీణ స‌డ‌క్ యోజ‌న పథ‌కం కింద మ‌న రాష్ట్రానికి మంజూరైన దాదాపు 158 రోడ్ల ప‌నుల ప్రగతి మీద మంత్రి ఒక్కో అంశం వారీగా చ‌ర్చించారు. ఆయా ప‌నుల‌ను స‌త్వరమే పూర్తి చేయాల‌న్నారు. నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ఉన్న ప‌నుల‌ను మొద‌టి ప్రాధాన్యతగా, ఇబ్బందులున్న ప‌నుల సమస్యలను వెంట వెంటనే పరిష్కరిస్తూ రెండో ప్రాధాన్యత అంశంగా గుర్తించి పూర్తి చేయాల‌ని మంత్రి ఆదేశించారు. ఆయా ప‌నుల‌ను అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.