మెట్రో ప్ర‌యాణికుల‌కు సువ‌ర్ణ ఆఫ‌ర్..

190
metro

ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌ ప్ర‌యాణికుల‌కు ఛార్జీల్లో రాయితీలు ప్ర‌క‌టించింది మెట్రో. మెట్రో సువ‌ర్ణ ఆఫ‌ర్ కింద ప్ర‌యాణాల్లో 40 శాతం రాయితీ క‌ల్పిస్తున్న‌ట్లు హైద‌రాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్ర‌క‌టించారు. రేప‌ట్నుంచి ఈ నెలాఖ‌రు వ‌ర‌కు మెట్రో ఛార్జీల్లో రాయితీ వ‌ర్తిస్తుంద‌ని తెలిపారు. ఈ సందర్భంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ. లాక్ డౌన్ తరువాత మెట్రోకి మంచి స్పందన వస్తోంది. ఈ నెల 12 వతేదిన 1 లక్ష మంది ప్రయాణించారు. 14 వ తేదీన 1 లక్ష 17 వేలకు చేరిందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలపారు.

ఒకరోజు తీవ్ర వర్షం పడినప్పుడు వెళ్లే దారి లేక వచ్చిన ” ప్రెగ్నెంట్ లేడీ” ఒక్కరికోసమే ప్రత్యేకంగా మెట్రో రైల్ నడిపించామన్నారు. విక్టోరియల్ మెమరీ స్టేషన్ నుండి మియపూర్ కి ఆ మహిళను ఇంటికీ పంపించాం. ప్రయాణికుల భద్రత కోసమే మెట్రో ముందుకు వెళుతుంది. మెట్రో చాలా డిసిప్లేన్ గా నడుపుతున్నాం.. దీంతో ప్రయాణికులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి ఈ నెల ఆఖరి వరకూ ప్రయాణికుల కోసం బతుకమ్మ ఆఫర్ నీ ఇస్తున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ కింది రాయితీలు వర్తింపు..

స్మార్ట్ కార్డు ద్వారా 14 ట్రిప్పుల చార్జీతో … 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం
20 ట్రిప్పుల చార్జీతో … 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం
40 ట్రిప్పుల చార్జీతో … 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం

టీ సవారీ మొబైల్ అప్లికేషన్ ద్వారా నవంబర్ 1 తేదీ నుంచి ఈ ఆఫర్ అమలు
7 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే … 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవకాశం
14 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే … 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం
20 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే … 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం
30 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే … 45 రోజుల్లో45 ట్రిప్పులు తిరిగే అవకాశం
40 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే … 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం