వచ్చె నెలలో రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామిఇచ్చారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈరోజు పాలకుర్తి లో పర్యటించిన అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రైతులకు 24గంటల కరెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు.
ఒకప్పుడు వ్యవసాయం దండగ అన్న కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు సీఎం కేసీఆర్ వ్యవసాయం అంటే పండగలా చేశారన్నారు. కాళేశ్వరం ద్వారా ప్రతి రైతుకు 50వేలు ఖర్చు చేస్తున్నామన్నారు. కళ్యాణ లక్ష్మీ పధకం ఆడపడచులకు అండగా ఉందని చెప్పారు.
పాలకుర్తిలో 123మందికి కోటి ఇరవై మూడు లక్షల కళ్యాణలక్ష్మీ చెక్కులు పంపిణి చేశామన్నారు. వచ్చె నెల నుండి వృద్దులకు 2000, వికలాంగులకు 3000 పెన్షన్లు ఇస్తామని చెప్పారు. బంగారు తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు మంత్రి ఎర్రబెల్లి.