క్రీడాకారులతో కబడ్డీ ఆడిన మంత్రి ఎర్రబెల్లి..

252
Errabelli Dayakar Rao
- Advertisement -

మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న 47వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీల ముగింపు ఉత్సవాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ టోర్నీలో రాష్ట్ర వ్యాప్తంగా 44 టీమ్స్ పాల్గొన్నాయి. 500 మంది బాయ్స్ అండ్ గర్ల్స్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్రీడాకారులను పరిచయం చేసుకొని, వాళ్ళతో ఫోటోలు దిగారు. కొన్ని టీమ్స్ తో కబడ్డీ ఆడారు. స్వతహాగా తాను కబడ్డీ ఆటగాడు అయిన మంత్రి కబడ్డీ ఆడి అందరినీ అలరించారు.

మంత్రి మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో కబడ్డీ పోటీలు నిర్వహించడం మా అదృష్టం. నేను కబడ్డీ ప్లేయర్‌ని. కెప్టెన్‌ను కూడా. వాలీబాల్, బడ్జెట్ బాల్ వంటి పలు క్రీడలు ఆడేవాడిని. అన్ని ఆటల్లో నేను బహుమతులు తేచ్చేవాడిని.. పల్లా రాజేశ్వర్ రెడ్డి, కల్లెడ ఎర్రబెల్లి రామ్ మోహన్ రావు తదితరులు సహకరించారు. ఆటలో అనేక మార్పులు వచ్చాయి. ఇది గ్రామీణ క్రీడ. గతంలో కబడ్డీకి క్రేజీ ఉండేది. ఈ ఆటను బాగా ప్రోత్సహించాలి అన్నారు.

ప్రభుత్వ పరంగా కబడ్డీని ప్రోత్సహించే విధంగా సీఎం కెసిఆర్‌కు చెబుతాను. కబడ్డీకి పూర్వ వైభవం తెద్దాం. కోచింగ్ క్యాంప్ నిర్వహణకు కూడా సాయంగా ఉందామన్నారు. అమ్మాయి క్రీడాకారులకు ఇబ్బందులు రాకుండా చూడాలి. స్థానికంగా ప్రజా ప్రతినిధులు క్రీడా నిర్వాహకులకు సహకరించాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి విజేతలైన టీమ్స్ కి, క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.

- Advertisement -