ప్రజలంతా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలిః మంత్రి ఎర్రబెల్లి

190
Minister Errabelli Dayakar Rao
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తొర్రూరు మండ‌లం మడిపల్లి గ్రామంలోని కపిల్ హోమ్స్ లో 6వ విడత తెలంగాణ కు హరితహారం లో భాగంగా మొక్క‌లు నాటారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తొర్రూరు పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ ఎదురుగా KGVB స్కూల్లో మొక్కలు నాటిన అనంతరం తొర్రూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వారి బిల్డింగ్ లో డాక్టర్లకు PPE కిట్లను పంపిణీ చేశారు.

ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..తెలంగాణ తరహాలో మొక్కలు నాటే కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదన్నారు. సీఎం కేసిఆర్ సాహసంతో వాతావరణ సమతౌల్యాన్ని మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. మొక్కలు జీవావరణాన్ని పెంపొందిస్తాయని ప్రజలంతా మొక్కలు నాటాలని కోరారు. అధికారులు లక్ష్యలకానుగునంగా పని చేయాలని ..నిర్లక్ష్యం వహించే అధికారులు, ప్రజాప్రతినిధులు మీద చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా వైరస్ ని అరికట్టడం, చికిత్స చేయడంలో డాక్టర్ల పాత్ర కీలకం డాక్టర్లు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మన ప్రాణాలు కాపాడుతున్నట్లు తెలిపారు.

- Advertisement -