బాలుడి కిడ్నాప్, హత్య సంఘటనపై మంత్రి విచారం..

88
minister errabelli

మహబూబాబాద్ జిల్లాలో జరిగిన బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య సంఘటనపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఆ సంఘటన పూర్వాపరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మహబూబాబాద్ సంఘటన చాలా బాధాకరం. దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.దగ్గరి వారే కిడ్నాప్ చేసి చంపడం మరింత హృదయ విదారకరం. ఆ బాలుడి తల్లిదండ్రుల కడుపు కోతకు అంతులేదు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని మంత్రి తెలిపారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి ఎస్పీని ఆదేశించానని అన్నారు. ఆ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియచేస్తున్నాను. సమాజంలో ఇలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు.