జూనియ‌‌ర్ చిరు వ‌స్తున్నాడు..!

41
chiru baby

క‌న్న‌డ హీరో చిరంజీవి స‌ర్జా ఇటీవ‌ల గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. 35 ఏళ్ళ వ‌య‌స్సులో చిరంజీవి స‌ర్జా మ‌ర‌ణించ‌డం కుటుంబస‌భ్యుల‌తోపాటు అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. కాగా, చిరంజీవి సర్జా స‌తీమ‌ణి మేఘ‌నా రాజ్ పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చింది. చిరంజీవి సార్జా సోద‌రుడు ధ్రువ సార్జా ఇన్ స్టాగ్రామ్‌లో ‘పండంటి చిన్నారి పుట్టాడు..జై హ‌నుమాన్ ‘ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు. మేఘ‌న, చిరుకు పండంటి బాబు జ‌న్మించాడని ధ్రువ సార్జా భార్య ప్రేర‌ణ శంక‌ర్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. మా కోసం ప్రార్థించి..మ‌ద్ద‌తుగా నిలిచిన‌ మీ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు..క్యాప్ష‌న్ ఇచ్చింది.

చిరంజీవి మ‌ళ్లీ జ‌న్మించాడంటూ..అత‌ని క‌జిన్ సూర‌జ్ సార్జా భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. ‘అంతులేని ప్రేమ‌తో చిరుకు స్వాగ‌తం ప‌లికాం. మీ మ‌ద్ద‌తుకు, ప్రార్థ‌నల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్టు’ చెప్పాడు. జూనియ‌‌ర్ చిరు వ‌స్తున్నాడంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. చిరంజీవి ఫొటో ముందు అత‌ని కొడుకును చూపిస్తున్న దృశ్యాలు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.