టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌..

36
SRH

ఐపీఎల్-13లో గురువారం మరో ఆసక్తికర మ్యాచ్‌ ప్రారంభం కానుంది. దుబాయ్‌ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్నాడు. కేన్‌ విలియమ్సన్‌ స్థానంలో హోల్డర్‌ జట్టులోకి వచ్చాడు. బసిల్‌ థంపీ స్థానంలో షాబాజ్‌ నదీమ్‌ను టీమ్‌లోకి తీసుకున్నట్లు వార్నర్‌ చెప్పాడు.

విజయ పరంపర కొనసాగించాలని స్టీవ్‌స్మిత్‌సేన భావిస్తుండగా..మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి ప్లే-ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని డేవిడ్‌ వార్నర్‌సేన ఆశిస్తోంది. ఇరు జట్లు కూడా ప్లే-ఆఫ్స్‌ బెర్తు కోసం పోరాడుతున్నాయి. . ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం మూడింటిలో మాత్రమే గెలిచింది. ఆరు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. మరో ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయింది. రాజస్థాన్ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ టీమ్..4 గెలిచింది. మరో ఆరింట పరాజయం పాలయింది. 8 పాయింట్లతో ఆరో స్థానలో ఉంది.

జట్ల వివరాలు:

రాజస్థాన్‌ రాయల్స్‌: బెన్ స్టోక్స్, రాబిన్ ఉతప్ప, సంజు సామ్సన్ (wc), స్టీవెన్ స్మిత్ (c), జోస్ బట్లర్, రాహుల్ టెవాటియా, జోఫ్రా ఆర్చర్, రియాన్ పరాగ్, శ్రేయాస్ గోపాల్, అంకిత్ రాజ్‌పూత్, కార్తీక్ త్యాగ్

సన్‌రైజర్స్‌ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), మనీష్ పాండే, ప్రియం గార్గ్, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, టీ నటరాజన్, షాబాజ్ నదీమ్.