రాష్ట్రంలో అర్హూలైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని చెప్పారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం రాఘవపూర్‌లో మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి ఎర్రబెల్లి డబుల్‌బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు మంత్రులు ఇండ్ల పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జెడ్పీఛైర్మన్ సంపత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… పేదల కోసం డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని అన్నారు. అర్హూలైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టి ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇండ్లులేని పేదలు ఉండొద్దన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల పేర్లతో ఆ పార్టీ కార్యకర్తలే దోచుకున్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి. కాళేశ్వరం ద్వారా రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ సస్యశ్యామలం చేస్తున్నారని అన్నారు.