జంతు సంరక్షణకు పూర్తి సహకారం:మాజీ ఎంపీ కవిత

434
Kavitha
- Advertisement -

జంతు సంరక్షణకు పూర్తి సహకారం అందిస్తామన్నారు మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత. చేవెళ్లలోని శంకరపల్లి మండల పరిధిలోని మిర్జాగూడలో రైట్ టు ఎనిమల్ సాంక్చుయరీ కవిత ప్రారంభించారు. చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ ఛైర్మన్ శ్రీ వెంకట్ రెడ్డి, స్థానిక సర్పంచి రవీందర్ గౌడ్ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు.

kavitha

ఈసందర్భంగా మాజీ ఎంపీ కవిత మాట్లాడుతూ.. త్వరలో తెలంగాణ పశు సంవర్ధక శాఖ సహకారంతో నాంపల్లిలో, జబి ఆధ్వర్యంలో జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయించి, ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తద్వారా దేశంలో జంతు సంరక్షణ కోసం చర్యలు తీసుకున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందున్నారు. ఇంట్లో వాళ్లకు సేవలు చేయడానికే అసహనానికి గురయ్యే ఈ రోజుల్లో..డబ్బును ఆశించకుండా, జంతు సంరక్షణకై జబీ చేస్తున్న కృషిని కవిత ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రామ ప్రణాళిక కార్యక్రమంలో సైతం, ప్రతి గ్రామంలో జంతు సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు .

- Advertisement -