- Advertisement -
పత్తి మార్కెట్లలో రైతులను వ్యాపారులు ఇబ్బంది పెట్టవద్దని సూచించారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పాలకుర్తి నియోజకవర్గం రాయపర్రతి మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీలో పత్తి కోనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పత్తి రైతులకు మద్దతు ధర ఇచ్చే విషయంలో ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోంది.
ఈసారి అధిక వర్షాలతో పత్తి రైతుకు కొంత ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవమే అన్నారు. పత్తి రైతులను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది. వర్షాలు ఎక్కువగా పడటంతో పత్తిలో తేమ శాతం కారణంతో వ్యాపారులు రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పలువురు అధికారులు పాల్గోన్నారు.
- Advertisement -