జ్వర సర్వేలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి..

59
- Advertisement -

రాష్ట్రం మొత్తం ఆరోగ్య తెలంగాణ కావాలి. ఇదే సీఎం కెసిఆర్ లక్ష్యం, ధ్యేయమని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జ్వర సర్వేలో భాగంగా ఈ రోజు మంత్రి జనగామ జిల్లాలోని పలు ప్రాంతాలలో జ్వర సర్వేలో పాల్గొన్నారు. ప్రజలతో కలిసి జ్వర సర్వే కార్యకర్తలతో మాట్లాడారు. సర్వే జరుగుతున్న తీరుని అడిగి తెలుసుకున్నారు.ప్రజల స్పందన ఎలా ఉందని అడిగారు. జ్వర సర్వే ప్రాధాన్యతను వివరించారు.

ఒక్క ఫోన్ కాల్ తో ఇంటికి వచ్చి కరోనాకి చికిత్స అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. ఇప్పటికే ప్రతి హాస్పిటల్‌లో తగు ఏర్పాట్లు చేశాం. అన్ని జిల్లా కేంద్రాల్లో ఆక్సిజన్ పడకలతో సహా అవసరమైన మందులు, ఇతర ఏర్పాట్లు చేశామని, ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా, అంగన్ వాడి కార్యకర్తలు ప్రజల ఆరోగ్యం కోసం ఫ్రంట్ వారియర్స్ గా చేస్తున్న సేవలను మంత్రి ప్రశంసించారు.

- Advertisement -