మాజీ ఎమ్మెల్యే జ‌గ‌న్నాథం మృతికి మంత్రి ఎర్ర‌బెల్లి సంతాపం..

21
errabelli

వ‌ర్ధ‌న్న‌పేట మాజీ ఎమ్మెల్యే మాచ‌ర్ల జ‌గ‌న్నాథం మృతికి రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు సంతాపం తెలిపారు. వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా, విలువ‌లు క‌లిగిన రాజ‌కీయ‌వేత్త‌గా పేరు తెచ్చుకున్న నాయ‌కుడు జ‌గ‌న్నాథం గార‌ని ఎర్ర‌బెల్లి తెలిపారు. బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తికి, ముఖ్యంగా గౌడ క‌మ్యూనిటి పేద‌ల ఆర్థిక పురోగ‌తికి ఎన‌లేని కృషి చేసిన మంచి నాయ‌కున్ని వ‌రంగ‌ల్ ప్ర‌జానికం కోల్పోయిందంటూ.. రాజ‌కీయాల్లో ఆయ‌న‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు.