కరోనా బాధితుల కోసం ఈ నటుడు ఏంచేశాడో చూడండి..!

30
Actor Arjun Gowda

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కభళిస్తోంది. దీని బారినపడి కుటుంబాలకు కుటుంబాలనే విచ్ఛిన్నం అవుతున్నాయి. ప్రస్తుత కరోనా కష్ట కాలంలో ఏ చిన్న సహాయం కూడా విలువైనదే. ఈ క్రమంలో ప్రముఖ కన్నడ సినీ నటుడు అర్జున్ గౌడ కరోనా బాధితుల కోసం అంబులెన్స్ డ్రైవర్‌గా అవతారమెత్తాడు. బెంగళూరు పరిధిలో కరోనా రోగులను ఆసుపత్రులకు తరలించడమే కాదు, కరోనాతో కన్నుమూసిన వారి అంత్యక్రియలకు ఉదారంగా సహకరిస్తున్నారు.

గత కొన్నిరోజుల నుంచి తన మకాం రోడ్డుపైనే అని అర్జున్ గౌడ వెల్లడించారు. ఇప్పటిదాకా, అనేకమందిని ఆసుపత్రులకు తరలించానని, ఒక అరడజను మందికి అంత్యక్రియల విషయంలో సాయం చేశానని అర్జున్ గౌడ వెల్లడించారు. ఈ కష్టకాలంలో ప్రాంతాలు, మతాలకు అతీతంగా సాయం చేయాలని అందరికీ పిలుపునిచ్చారు.