ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పువ్వాడ..

23
Minister Puvvada

తెలంగాణలోని గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, మరో ఐదు మున్సిపల్‌ కార్పొరేషన్లకు పోలింగ్ కొన‌సాగుతోంది. ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ (కేఎంసీ) ఎన్నికల పోలింగ్ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , ఆయన సతీమణి పువ్వాడ వసంతలక్ష్మి , తనయుడు DR.పువ్వాడ నయన్ రాజ్‌తో కలిసి హార్వెస్ట్‌ స్కూల్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారులు కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారని ఆయన వెల్లడించారు. ఓటర్లు భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరు ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు.