ఉద్యోగులు ఆశించిన విధంగా పీఆర్సీ: ఎర్రబెల్లి

159
dayakar rao
- Advertisement -

ప్రభుత్వ ఉద్యోగులు ఆశించిన విధంగా పీఆర్సీ ఉంటుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్‌లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంపీ బండా ప్రకాశ్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి…పొరుగు రాష్ట్రాల కంటే ఒకటి రెండు శాతం ఎక్కువ పీఆర్సీ వస్తుందన్నారు.

ఓట్ల కోసం సవతితల్లి ప్రేమ చూపే పార్టీలను నమ్మవద్దని…ఇద్దరు ఎమ్మెల్సీలు గెలిస్తే ప్రభుత్వం కూలుతుందని మాట్లాడుతున్నారు…వారికి మెదడు పనిచేయడం లేదన్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలతో ప్రభుత్వం ఎలా కూలుతుందో చెప్పాలి…కోచ్ ఫ్యాక్టరీ తేవడం చేతగాని దద్దమ్మలు, చవటలు చెడగొట్టు మాటలతో ప్రజలను రెచ్ఛగొడుతున్నారని మండిపడ్డారు. ప్రజల మద్దతు వున్న ప్రభుత్వాన్ని కూల్చడం ఎవ్వరి తరం కాదు…పిచ్చిపిచ్చి కూతలు కూస్తున్న వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.

- Advertisement -