పదోతన్నతులపై ఆందోళన వద్దు: ఎంపీడీవోలతో ఎర్రబెల్లి

122
errabelli
- Advertisement -

తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల రాష్ట్ర సంఘం డైరీ క్యాలెండర్ లను ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలులో పంచాయతీరాజ్ ఉద్యోగుల పాత్ర కీలకంగా ఉంది అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అనేక కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ఎంపీడీవోలు సమర్ధవంతంగా పని చేస్తున్నారన్నారని అభినందించారు. ప్రజలను ప్రభుత్వ పథకాలలో భాగస్వాములను చేస్తూ ఆయా పథకాల విజయవంతం చేయడంలో పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ ఉద్యోగులు ప్రతిభను కనబరుస్తున్నారని మంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం కావడంలో లో ఎం పీ డీ వో ల పాత్ర ఎంతో ఉందన్నారు.

పదోన్నతుల విషయంలో లో ఎంపీడీవోలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. 20 సంవత్సరాలుగా 80 మంది ఎంపిడివోలు, 13 సంవత్సరాలుగా 60 మంది ఎంపీడీవోలు ప్రమోషన్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు మంత్రి దృష్టికి తెచ్చారు. అయితే, సీఎం కేసీఆర్ పదోన్నతులను వెంటనే చేపట్టాలని ఆదేశించారని ఈ క్రమంలో ఎంపీడీవోల పదోన్నతులు కూడా పూర్తవుతాయని మంత్రి చెప్పారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడంలో అధికారుల పాత్ర కీలకమన్నారు. ఎంపీడీవోలు పంచాయతీరాజ్ వ్యవస్థలో అత్యంత కీలకంగా పని చేస్తున్నారని వారిని అభినందించారు. ఎంపీడీవోల పదోన్నతుల విషయంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సానుకూలంగా ఉన్నందున ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో టిజీవోల సంఘం అధ్యక్షురాలు మమత, కార్యదర్శి సహదేవ్, డిప్యూటీ సీఈఓ ల సంఘం అధ్యక్షుడు బి. రాఘవేందర్ రావు, తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల రాష్ట్ర సంఘం అధ్యక్ష కార్యదర్శులు సత్తయ్య, ప్రశాంతి, ఉపాధ్యక్షులు మల్లికార్జున్, ప్రచార కార్యదర్శి నరేందర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శంకర్ నాయక్, శ్రీనివాస్, భాస్కర్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -