మధ్యాహ్న భోజన సిబ్బంది పాత్రమరువలేం: ఎమ్మెల్సీ కవిత

25
kavitha

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలబాలికలకు పౌష్టికాహారం అందజేయడంలో మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది పాత్ర మరువలేనిదన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. “మిడ్ డే మీల్స్ కుకింగ్ వర్కర్స్ యూనియన్” యూనియన్ ప్రతినిధులు ఎమ్మెల్సీ కవిత గారిని హైదరాబాద్ లోని నివాసంలో కలిశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న సీఎం కేసీఆర్ గారి ఆశయాన్ని నెరవేర్చడంలో, మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది పాత్ర కీలకమన్న ఎమ్మెల్సీ కవిత… సిబ్బందికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు పలు అంశాలను ప్రస్తావించగా, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. “మిడ్ డే మీల్స్ కుకింగ్ వర్కర్స్ యూనియన్” రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల హనుమండ్లు, ప్రధాన కార్యదర్శి డి.బాబాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.