- Advertisement -
ఉపాధి హామీ ఉద్యోగులు, సిబ్బంది వల్లే తెలంగాణ రాష్ట్రానికి ఉత్తమ అవార్డులు వచ్చాయని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇలాంటి సమయంలో ఫీల్డ్ అసిస్టెంట్‌లు లేకపోవడం బాధగా ఉందని వారిపై ప్రభుత్వానికి సానుభూతి ఉందని తెలిపారు. వారిని ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు.
కరోనా వల్ల రాష్ట్రం చాలా వెనకకు పోయిందని.. అయినా సరే, సీఎం కేసీఆర్ అన్ని ముఖ్యమైన పథకాలను కొనసాగిస్తున్నారన్నారు. కొందరు గిట్టని వాళ్ళు ఏవేవో మాట్లాడుతున్నారని.. కేంద్ర ప్రభుత్వం కూడా అవసరమైన స్థాయిలో మన రాష్ట్రానికి సహకారం అందించడం లేదని మండిపడ్డారు.
రైల్వేను మోడీ ప్రైవేట్ కి అప్పగించారని ఆగ్రహించారు. అన్నీ ప్రైవేట్ పరం చేస్తే రేపు మన నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయా? మన రిజర్వేషన్లు కూడా పోయేటట్లు కుట్ర జరుగుతున్నదని పేర్కొన్నారు.
- Advertisement -