- Advertisement -
హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక పరికాలను అందుబాటులోకి తీసుకువచ్చి రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజెందర్. నిమ్స్ ఆసుపత్రిని మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా నిమ్స్ హాస్పిటల్ లోని పాత భవనాలకు మార్పులు చేస్తున్నట్టు చెప్పారు.
నిమ్స్ లో నూతన టెక్నాలజీని, పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. త్వరలో ఓపీ బ్లాక్ మరింతగా విస్తరిస్తామని, రోగుల సంఖ్య పెరగడంతో బెడ్స్ కొరత ఉందని, ఈ సమస్యపై దృష్టి సారించినట్టు చెప్పారు. అదేవిధంగా నిమ్స్ లో ఉద్యోగుల కొరత కూడా ఉందని ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు.
- Advertisement -