రైతులు ఇబ్బంది పడకుండా ధరణి వెబ్ సైట్..

148
Errabelli Dayakar Rao
- Advertisement -

రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ధరణి వెబ్ సైట్ ఏర్పాటు చేశారని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రం లోని వ్యవసాయ మార్కెట్ లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ అధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంబించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ద్వారా రైతులు ఇబ్బందులు పడకుండా ఉండ టానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. srsp కెనాల్ ద్వారా కాళేశ్వరం నీళ్ళు ఇవ్వటం వల్ల పంటలు మంచిగా పండుతున్నాయన్నారు. కరోనా నేపథ్యం లో లారీ లు , గన్ని బ్యాగ్ లు ,ట్రాన్స్పోర్ట్ వంటి సమస్యలు వచ్చాయన్నారు.

కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచటం జరిగిందన్నారు.కేంద్రం ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసినా, మన ముఖ్యమంత్రి కేసీఅర్ గారు రైతులను ఆదుకోవాలని కోరారు.దేశం లో ఎవరు కూడా రైతులను పట్టించుకునే పాపాన పోలేదు.బిజెపి, కాంగ్రెస్ పార్టీ లు ఏలుతున్న రాష్ట్రాల్లో రైతుల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.

దేశం లో ఎక్కడ లేకుండా రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం కేసీఅర్ ప్రభుత్వమే ..వ్యవసాయం ద్వారా ఆర్థికంగా అంద రూ ఎదగాలని అప్పులు ఐనా, కెసిఆర్ రైతులను ఆదుకుంటాన్నారు.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేకున్నా సంక్షేమ పథకాలు మాత్రం ఆపకుండా చేస్తున్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా రైతులు ఇబ్బందులు పడకుండా వ్యవసాయ శాఖ అధికారులు, ఐకెపి సంఘాలు సమన్వయం తో పనిచేయాలన్నారు.

- Advertisement -