శివకోటి ఆలయ విగ్రహ ప్రతిష్టాపనకు హాజరైన మంత్రి..

32
minister allola

నిర్మల్ పట్టణం బుధవార్ పెట్ లోని పురాతన ఆలయం శివ కోటి ఆలయ నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సోమవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు.వేద పండితులతో కలిసి శివలింగాన్ని ప్రతిష్టించారు. పెద్ద ఎత్తున మహిళలు మంగళహారతులతో తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేవాలయాల్లో ఆధ్యాత్మికత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటదని ఈ ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.50 లక్షల నిధులు కేటాయించామని కాంపౌండ్ వాల్ ఆలయ అభివృద్ధి పనులకు మరో 15 లక్షలు నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. శివకోటి మందిరం ద్వారా బుధవార్ పెట్ చౌరస్తాకు కొత్త శోభ వచ్చిందన్నారు. శివ లింగాన్ని బనారాస్ నుండి, పీఠాన్ని మహాబలిపురంలో శిల్పులతో ప్రత్యేకంగా తయారు చేయించామని మంత్రి అన్నారు.

శివుని రోజు సోమవారం శుభ దినాన అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన జరగడం గొప్పదని అన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉండటం వల్ల నిర్మల్ పట్టణంలోని నంది గుండం దుర్గామాత ఆలయం, బాలాజీ వాడ వీర హనుమాన్, చింతకుంట వాడ హనుమాన్ ఆలయాలను కాకుండా ఎన్నో ఆలయాలను నిర్మించుకోవడం జరిగిందన్నారు. బంగల్ లెట్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని రూ. 1కోటితో త్వరలోనే అభివృద్ధి చేస్తామన్నారు. దేశంలోనే రెండో కోతుల పునరావాస కేంద్రాన్ని నిర్మల్‌లో ఏర్పాటు చేసుకున్నామని నిర్మల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. చైన్ గేట్ నుండి బంగల్ పెట్ వరకు రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. అనంతరం శివకోటి ఆలయ కమిటీ సభ్యులు మంత్రిని శాలువా మెమెంటోతో సన్మానించారు.