బెంచ్ కారులో వచ్చి కల్లు తాగే రోజులు వస్తాయి. కల్లు తాగితే పదహారు రోగాలు నయం అవుతాయని రాష్ట్ర అబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లాలో దానవాయిగూడెంలో మంత్రి తాటి వన్నాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కల్లు గీత వల్ల 9 కులాలు జీవనాధారం పొందుతాయి. ఓటు బ్యాంకుగానే బీసీ కులాలను గతంలో పరిగనించారు. కేసీఆర్ వచ్చాక చెట్టు పన్ను రద్దు చేశారని మంత్రి తెలిపారు.
హైదరాబాద్ 9 కోట్లతో నీరా కేఫ్ పెడుతున్నామని.. ఇప్పటివరకు 3.5 కోట్ల తాటి, ఈత చెట్లు నాటామని మంత్రి పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో తాటి వనం , ఈతవనం పెడతామన్నారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేసీఆర్ ఢిల్లీకి పంపారని గుర్తు చేశారు. ఏ నాయకుడు మన గురించి పాటు పడతారో ఆయనకు మనం అండ గా ఉండాలి. మన బీసీల కోసం పాటుపడుతున్న కేసీఆర్‌ను మనం ఆదరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు.