26 నుండి మత్స్యకారుల సభ్యత్వ నమోదు..

30
talasani

ఈ నెల 26 వ తేదీ నుండి రాష్ట్రంలో మత్స్యకారుల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుందని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ముదిరాజ్, గంగపుత్రులు, తెనుగు, గుండ్ల బెస్త, బెస్త, ముతరాసి తెగలకు చెంది 18 సంవత్సరాల వయసు దాటిన వారు అర్హులు. కోట్లాది రూపాయల తో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల లబ్ది అర్హులందరికీ అందలానేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అన్నారు తలసాని.

పిబ్రవరి మొదటి వారంలో 150 సంచార చేపల విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తాం అని తెలిపిన తలసాని….మత్స్యకార మహిళలకు స్వయం ఉపాది కల్పించేలా 6 లక్షల రూపాయల సబ్సిడీ పై సంచార చేపల విక్రయ వాహనాలను అందజేయడం జరుగుతుందన్నారు.