కళామతల్లి ముద్దుబిడ్డ ,మిమిక్రీ సామ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్ ఇక లేరు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వేణుమాధవ్ వరంగల్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 16 ఏళ్ల వయసులో కెరీర్ ప్రారంభించిన వేణుమాధవ్ దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు,హిందీ,ఉర్దూ,ఇంగ్లీష్,తమిళంలో ప్రదర్శనలు ఇచ్చారు. 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1972 నుంచి 1978 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇటీవల వేణుమాధవ్ పేరుతో కేంద్రప్రభుత్వం పోస్టల్ స్టాంపులను కూడా విడుదల చేసింది.
జాన్ ఎఫ్ కెనడీ,నెహ్రూ,ఇందిరాగాంధీ సహా పలువురు నాయకులను ధ్వని అనుకరణ చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. మూడు యూనివర్సిటీల నుంచి డాక్టరేట్ తీసుకున్న ఆయన రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాన్ని సైతం అందుకున్నారు. ఐక్యారాజ్యసమితిలో ప్రదర్శనలు కూడా ఇచ్చారు.
డిసెంబర్ 28,1932 వరంగల్ జిల్లా మట్టెవాడలో జన్మించారు వేణు మాధవ్. మొదటిసారి తెలుగు యూనివర్సిటీలో మిమిక్రీ డిప్లామాను ప్రవేశపెట్టారు నేరెళ్ల. ఆయన మృతి పట్ల పలువరు సంతాపం వ్యక్తం చేశారు. మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి…నేరెళ్లతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.