మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

112
gold

పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఇవాళ 99.9 స్వ‌చ్ఛ‌త క‌లిగిన 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.241 పెరిగి రూ.45,520కి చేరింది.బంగారం బాటలోనే వెండి ధ‌ర‌లు కూడా ఇవాళ స్వ‌ల్పంగా పెరిగాయి. కిలో వెండి ధ‌ర రూ.781 పెరిగి రూ.68,877కు చేరింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో ఇవాళ ఔన్స్ బంగారం ధ‌ర 1,753 అమెరిక‌న్ డాల‌ర్‌లు, ఔన్స్ వెండి ధ‌ర 26.90 అమెరిక‌న్ డాల‌ర్‌లు ప‌లికింది.