మిల్లర్‌ దూకుడు…గుజరాత్ గెలుపు

80
- Advertisement -

చెన్నైపై ఘనవిజయం సాధించింది గుజరాత్. మిల్లర్ వన్ మ్యాన్‌తో గుజరాత్ గెలుపొందింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్…19.5 ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి లక్ష్యాన్ని చేధించింది. డేవిడ్‌ మిల్లర్‌ (51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 94 నాటౌట్‌) దూకుడుకు.. రషీద్‌ (21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40) విధ్వంసం తోడవడంతో గుజరాత్ విజయం సాధించింది.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై… నిర్ణీత 20 ఓవర్లలో 169/5 స్కోరు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (48 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 73), రాయుడు (31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46) రాణించారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గా మిల్లర్‌ నిలిచాడు. హార్దిక్‌ పాండ్యా గాయంతో బరిలోకి దిగకపోవడంతో రషీద్‌ఖాన్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

- Advertisement -