కేంద్రంలో చక్రం తిప్పనున్న ఆరుగురు నేతలు..!

360
federal front

73 ఏళ్ల స్వతంత్ర్య భారతంతో ఇప్పటివరకు అయితే కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ లేదా బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ మెజార్టీగా దేశాన్ని పాలిస్తూ వచ్చాయి. ఈ రెండు కూటముల సారథ్యంలో భారత్‌ సాధించిన ప్రగతి అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో భారత రాజకీయాల్లో రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని సర్వేలు కుండబద్దలు కొడుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన మూడు దశల పోలింగ్‌లో సరళిని పరిశీలిస్తే ఇదే అంశం స్పష్టమవుతోంది. పొలిటికల్ ఎనలిస్టులు సైతం కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదని అంచనా వేస్తుండగా ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.

దేశంలో హంగ్‌ వచ్చే పరిస్ధితి నెలకొన్న నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలదే హవా అని ఆర్టికల్‌ని పబ్లిష్ చేసింది. దేశ రాజకీయాల్లో ఆ ఆరుగురు నేతలు చక్రం తిప్పబొతున్నారని కథనాన్ని ప్రచురించింది. తెలంగాణ సీఎం కేసీఆర్,వైసీపీ అధినేత జగన్,సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్,బీఎస్పీ అధినేత్రి మాయవతి,తృణమూల్ చీఫ్ మమతా,జేడీయు నేత,ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న కీలకం కానున్నారని తెలిపింది.

దేశ వ్యాప్తంగా ఉన్న సీట్లలో ఈ ఆరుగురు నేతలకు చెందిన పార్టీలు దాదాపు 20 శాతం సీట్లను సాధిస్తాయని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 42 ఎంపీ స్ధానాల్లో తెలంగాణలో టీఆర్ఎస్‌,ఏపీలో వైసీపీ కలిసి 30 నుండి 35 స్ధానాలు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఒడిశాలోని మొత్తం 21 స్ధానాలకు గాను నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని జేడీయు 14 నుండి 15 స్ధానాలు గెలుచుకుంటుందని కథనాన్ని ప్రచురించింది.

బెంగాల్‌లో మరోసారి మమతకు తిరుగులేదని ఇక్కడ ఉన్న 42 స్ధానాల్లో తృణమూల్ 34 స్ధానాల్లో విజయబావుట ఎగురవేయడం ఖాయమని తెలపగా యూపీలో అఖిలేష్-మాయావతి సారధ్యంలోని కూటమి 40కి పైగా స్ధానాలను దక్కించుకోనుందని తెలిపింది.

కేంద్రంలో ఏ పార్టీకి మెజార్టీ దక్కని పరిస్థితి నెలకొనడంతో ఈ ఆరుగురు నేతలు కీలకం కానున్నారు. కొంతకాలంగా కాంగ్రెస్,బీజేపీయేతర ప్రభుత్వమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ వీరితో కలిసి ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నారని పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలవడక ముందే మరోసారి కేసీఆర్ ఫెడరల్‌ టూర్‌కు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని…టూర్‌లో భాగంగా ప్రాంతీయ పార్టీల ఐక్యత గురించి వివరించి రాష్ట్రాల హక్కులను కాపాడుకునే దిశగా అడుగులు వేయనున్నారని తెలిపింది.