టాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో ఒకరు మిల్కీబ్యూటీ తమన్నా. 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వచ్చిన తమన్నా…స్టార్ హీరోలందరి సరసన నటించింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది.
ఇక కెరీర్ గాడిలో ఉన్నప్పుడే సంపాదించాలనే కాన్సెప్ట్‌తో భారీగానే ఆస్తులు కూడబెట్టిందట మిల్కీ బ్యూటీ. దాదాపుగా రూ. 150 కోట్లకు పైగా ఆస్తులను కూడ బెట్టిందట ఈ అమ్మడు. ముంబైలోని అత్యంత ఖరీదైన జుహూ ఏరియాలో దాదాపు 16 కోట్లు విలువ చేసే అపార్ట్మెంట్ ఉంది. అలాగే హైదరాబాద్ లో కూడా ఓ ఖరీదైన ఇల్లు ఉంది.
అంతేకాక తమన్నా దగ్గర కోటి రూపాయల మెర్సిడెస్ బెంజ్, 80 లక్షల రేంజ్ రోవర్, 50 లక్షల బీఎండబ్ల్యూ, మరో కారు కూడా ఉన్నాయి. ఇక తన సొంత ఊళ్ళో ఒక సొంత ఇల్లు, తన పేరెంట్స్ ఉండే ఇంటితో పాటు మరిన్ని ఆస్తులు బాగానే కూడబెట్టిందని సమాచారం. మొత్తంగా ఈ అమ్మడి ఆస్తుల విలువ తెలిసి అంతా షాక్ అవుతున్నారు.