మిల్కీ బ్యూటీ కల నిజమైందట..!

25
- Advertisement -

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా కల నిజమైందట. అది ఎటువంటి కల. అలాంటి కల ఏంటి అని అనుకుంటున్నారా..? అయితే వరుసగా బిజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. తన నటన డ్యాన్స్‌తో ఆకట్టుకునే ఈ అమ్మడు ఇప్పడు ఏకంగా ఇద్దరు అగ్ర హీరోలతో ఆడిపాడడానికి సిద్ధమైంది. అయితే ఈ బ్యూటీ ఏకంగా తమిళ తలైవ రజినీకాంత్‌తో నటిస్తున్నందుకు తన కల నిజమైందని అన్నారు.

రజనీకాంత్ సర్‌తో కలిసి పనిచేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. నా కల నిజమైంది. ఆయన్ని సెట్‌లో చూసే రోజు కోసం ఎదురుచూశా. అలాగే చిరంజీవితో కలిసి ఇదివరకే సైరా నరసింహారెడ్డిలో నటించాను. ఇప్పడు మళ్లీ తాజాగా భోళా శంకర్‌లో నటించే అవకాశం వచ్చిందన్నారు. అయితే ప్రస్తుతం ఈభామ హిందీలో బోల్‌చుడీయా మలయాళంలో బాంద్రా సినిమాల్లోనూ నటిస్తోంది. మరోవైపు వెబ్‌సిరీస్‌లతోనూ సందడి చేయడానికి సిద్ధమైంది. అయితే ఆహా కోసం లెవెన్త్‌ అవర్‌లో నటించిన తమన్నా…అమెజాన్‌ హాట్‌స్టార్‌లలోనూ వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తోంది.అన్నట్టు ఇటివలే గుర్తుందా శీతాకాలం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది.

ఇవి కూడా చదవండి…

వీరసింహారెడ్డి ఓటీటీలోకి ఎప్పుడంటే…

పవన్ మరో సినిమా!

సోషల్ డ్రామాతో హిట్ కొడతాడా ?

- Advertisement -