పవన్ మరో సినిమా!

13
- Advertisement -

ఇటు సినిమాల్లో అటు రాజకీయంలో రెండు రకాలుగా బిజీ అయ్యాడు పవన్ కళ్యాణ్. వరుసగా హరీష్ శంకర్ , సుజీత్ దర్శకత్వం వహించబోయే రెండు చిత్రాలను ప్రారంభించాడు OG, ఉస్తాద్ భగత్ సింగ్ రెండు ఇటీవల ఓపెనింగ్ జరుపుకున్నాయి.

ఇప్పుడు ఆ రెండు సినిమాలను పక్కన పెట్టి మరో రీమేక్ సినిమాను మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ్ లో హిట్ అయిన వినోదయ సీతం సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు పవన్. వచ్చే వారం షూటింగ్ స్టార్ట్ చేసేందుకు పవన్ అంగీకరించినట్లు ఇన్సైడ్ టాక్. ఈ సినిమా ఫిబ్రవరి 14 నుండి ప్రారంభం కానుందని తెలుస్తుంది.

సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరో కథానాయకుడిగా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్‌కి జోడీగా నటించేందుకు కేతికా శర్మ సంతకం చేసింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -